వైసిపిలోకి వలసలే వలసలు.. ఆ మంత్రి కూడానా?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంప్ జిలానీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష వై.ఎస్.జగన్ పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా టిడిపికి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయగా ఏకంగా ఒక మంత్రి కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట.
ఆయనెవరో కాదు గంటా శ్రీనివాస్ అనే ప్రచారం మొదలైంది. టిడిపిలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ నారా లోకేష్ కారణంగా పార్టీని వదులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్‌తో విభేదాలు ఏర్పడటానికి స్థానిక టిడిపి నేతలే కారణంగా కూడా తెలుస్తోంది. అయితే మంత్రిగా పనిచేస్తూ పార్టీ మారడానికి కాస్త సమయం తీసుకోనున్నారట శ్రీనివాస్.
ఈనెల చివరిలోగా వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదని చెప్పుకుంటున్నారు. మరి ప్రచారంలో వున్న ఈ వార్త నిజమో కాదో చూడాల్సి వుంది.