శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:58 IST)

తెదేపా నేతలను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన తెదేపా నేతలు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన శారద, కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. వైసీపీ రౌడీమూకల దౌర్జన్యకాండపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి ఏ విధంగా జరిగిందో, ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

మూడు రోజుల క్రితం జోగి రమేష్‌ అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్‌ను తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ మీకు అన్నివిధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.