1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 2 జులై 2018 (20:27 IST)

సీఎం చంద్రబాబు నాయుడు కార్నర్ అవుతున్నారా?

ఈ నాలుగేళ్లలో చేసిన తప్పిదాలను, వైఫల్యాల ఒకవైపు అనూహ్యంగా వరుసగా వచ్చిపడుతున్న వివాదాలు మరోవైపు... వీటితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తల బొప్పికడుతోంది. ప్రతిపక్షాలను ఇరుకున పెట్డాలనుకుంటే తెదేపానే ఇరుక్కుపోతోంది. ఆ మధ్య నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ

ఈ నాలుగేళ్లలో చేసిన తప్పిదాలను, వైఫల్యాల ఒకవైపు అనూహ్యంగా వరుసగా వచ్చిపడుతున్న వివాదాలు మరోవైపు... వీటితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తల బొప్పికడుతోంది. ప్రతిపక్షాలను ఇరుకున పెట్డాలనుకుంటే తెదేపానే ఇరుక్కుపోతోంది. ఆ మధ్య నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లినపుడు, ఆనందంగా ప్రధాని మోదీతో కరచాలనం చేసిన బాబు ఫొటోలు బయటకు వచ్చాయి. మీడియా ప్రతినిధులు తీశారా లేక బిజెపి నేతలే విడుదల చేశారోగానీ ఈ ఫొటోలు దుమారం రేపాయి. అమరావతిలో యుద్ధం ఢిల్లీలో స్నేహమా అంటూ ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. సమాధానం చెప్పుకోలేక దేశం నాయకులు తలలు పట్టుకున్నారు.
 
ఆ తరువాత క్షురకుల వివాదం వచ్చింది. తమ సమస్యప పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చిన క్షురకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ బాబు వ్యవహరించిన తీరుతో బిసిలు మండిపడ్డారు. తమ నేత ప్రవర్తనతో టిడిపి నాయకులే విస్తుపోయారు. బాబును సమర్థించలేక సతమతమయ్యారు. ఏరువాక పేరుతో పొడి నేలపై నాట్లు వేసిన వైనంపై విపక్షాలు ఎద్దేవా చేసేలా చేసింది. ఇక కడప ఉక్కు సాధించే పేరుతో సిఎం రమేష్ నిరాహార దీక్ష చేస్తుండగా ఢిల్లీలో ఆ పార్టీ నేతలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాశంగా మారాయి. 
 
ఐదు కేజీలు తగ్గడానికి నేను వారం రోజులు దీక్ష చేస్తా అంటూ జోక్‌లు వేసుకుంటూ మాట్లాడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చి దుమారమే రేపుతున్నాయి. దీక్షలతో మైలేజీ వస్తుందనుకుంటే టిడిపి చిత్తశుద్ధిపైనే అనుమానాలు ప్రబలిన ఈ ఉదంతంతో బాబు తలమీద చెయ్యిపెట్టుకున్నారు. ఇలాంటప్పుడా జోకులూ, అయినా మాట్లాడేటప్పుడు ఎవరున్నారో చూసుకోవాల్సిన అవసరం లేదా, ఇంతకీ ఈ వీడియో ఎవరు‌ తీశారో తేల్చండి… అంటూ హుకుం జారీ చేశారట. అన్నింటికీ మించి టిటిడి విషయంలో రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలు రెండు నెలలుగా ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి. మొదట్లో దీక్షితులు ఆరోపణలను కొట్టిపారేసిన ప్రభుత్వం ఇప్పుడు జ్యుడీషియల్ విచారణ చేయిస్తానంటోంది. ఆమధ్యలో ధర్మ దీక్ష సభలో ప్రధానిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇలా కొంతకాలంగా తెలుగు దేశం పార్టీ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి.