శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (16:27 IST)

మగాడివి కాదు.. చచ్చిపో అంది.. అందుకే సూసైడ్ చేసుకున్నా.. టెక్కీ లేఖ

ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, కట్టుకున్న భర్తను కించపరిచేలా మాట్లాడటంతో మనోవేదన చెందిన టెక్కీ ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. ఈ ఆత్మహత్య కేసులో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా తిరునగరికి చెందిన ప్రశాంత్ (34) అనే వ్యక్తి వరంగల్‌కు చెందిన పావని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. దీంతో హైదరాబాద్‌, శ్రీనగర్‌ కాలనీలోని పద్మజ మ్యాన్షన్‌లో నివాసం ఉంటూ ఎవరి కార్యాలయానికి వారు వెళ్లి వచ్చేవారు. 
 
అయితే, వివాహమై సంవత్సరాలు గడిచిపోతున్నా పిల్లలు కలగలేదు. అదేసమయంలో పావనికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్రశాంత్‌కు తెలిసి పలుమార్లు మందలించాడు. అయినా పావనిలో ఎలాంటి మార్పురాలేదు. పైగా, భర్తనే తిట్టేది. నీవు మగాడివి కాదు.. చచ్చిపో అంటూ వేధించింది. దీంతో ప్రశాంత మానసిక వేదనకు లోనయ్యాడు. 
 
ఈ క్రమంలో బావ సలహా మేరకు భార్యను ప్రశాంత్ బెంగుళూరుకు పంపించాడు. అయినప్పటికీ ఆమె మరో వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉండటాన్ని ప్రశాంత్ జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా, తనను భార్య ఏ విధంగా తిట్టిందో సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఈ సూసైడ్‌ నోట్‌ను పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.