శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (19:20 IST)

ఏపీలో షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.

జులై 10 నుంచి పరీక్షలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో రద్దు చేసినా ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి నిర్వహిస్తామన్నారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.. వారందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ జిఒ జారీ చేసింది.

అనంతరం తమిళనాడు ప్రభుత్వమూ తెలంగాణ బాటలోనే నడిచి పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటించింది. ఎపిలో ఓ పక్క కేసులు పెరుగుతున్నా పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.