ఆ రెండు పార్టీల నడుమ ఓట్ల తేడా 10 లక్షలే
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి...ఓటింగ్ శాతం ఎంత అనేది ఎన్నికల సంఘం విడుదల చేసింది.
మొత్తం 47,46,195 ఓట్లు చెల్లగా దీనిలో అధికార వైకాపాకు దాదాపు 24.97 లక్షల ఓట్లు రాగా ప్రతిపక్ష టిడిపికి 14.58 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైకాపా 52.63శాతం ఓట్లు సాధించగా, ప్రతిపక్ష టిడిపి 30.73శాతం ఓట్లు సాధించాయి.
24లక్షల ఓట్లు సాధించిన వైకాపా 2265 వార్డులు/డివిజన్‌లు సాధించగా, టిడిపి 349 వార్డులు/డివిజన్‌లు సాధించింది. కాగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం తమదేనని చెబుతోన్న 'బిజెపి' పార్టీకి లక్షకు చిల్లర ఓట్లు వచ్చాయి.
మొత్తం 2.41శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ 9 వార్డులు/డివిజన్‌లు సాధించి 0.3శాతం వార్డుల విజయాన్ని నమోదు చేసింది. ఇక 'జనసేన' 2.21లక్షలకు పైగా ఓట్లు సాధించింది. దీని ఓటింగ్ శాతం 4.67 కాగా 25 డివిజన్లు/వార్డులు సాధించింది.
ఇది మొత్తం విన్నింగ్ శాతంలో 0.9శాతం. 'జనసేన+బిజెపి' కూటమి 5.8శాతం ఓట్లు సాధించింది. సిపిఐ 38వేలు ఓట్లు సాధించగా, సిపిఎం 38 వేలు ఓట్లు సాధించింది.
ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ 29వేల ఓట్లు సాధించగా, బిఎస్పీ 4వేలు ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 20వేల ఓట్లు.