బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (08:05 IST)

కేసీఆర్ ఫాంహౌస్‌లో ఓట్లు లెక్కిస్తారేమో: విజయశాంతి

దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు.

హరీష్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీన్నిబట్టి ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే... అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుందని విజయశాంతి చెప్పుకొచ్చారు.

హరీష్ రావు కామెంట్ చూస్తూ ఉంటే... దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారేమోనని అనుమానం కలుగుతోందని ఆమె ఎద్దేవా చేశారు.