ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

కార్మికుల మరణాలకు ఇసుక కొరత కారణం కాదు: బుగ్గన

ఇసుక కొరతపై.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక సమస్య కారణంగానే అంతా చనిపోతున్నారన్నది అవాస్తవమని అన్నారు. ఇలాంటి మరణాలకు అనేక కారణాలు ఉంటాయని చెప్పారు.

దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన బుగ్గన.. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరినట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దిల్లీలో కలిశారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వం 40 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. ప్రత్యేక దృష్టితో చూసి.. రాష్ట్రాన్ని ఆదుకోవాలని, ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఇప్పటివరకూ ఇవ్వాల్సిన మొత్తంలో కేంద్రం 1850 కోట్లు విడుదల చేసిందన్న ఆర్థిక మంత్రి బుగ్గన... మిగిలిన మొత్తాన్నీ కేంద్రం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఎవరి సంక్షేమ పథకాల ప్రాముఖ్యత వారికి ఉంటుంది.

అమ్మఒడి, రైతు భరోసా, బోధనా రుసుముల చెల్లింపు, వృద్దాప్య పెన్షన్, వాహన మిత్ర పథకాలు ప్రాముఖ్యతతో ఉన్నాయి. చట్టాన్ని పూర్తి స్థాయిలో అనుసరించేలా చూడటమే.. వాహన మిత్ర పథకం ముఖ్య ఉద్దేశ్యం.

రైతు భరోసా కింద రైతులు కట్టాల్సిన బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఫలితంగా.. బీమా చెసే రైతుల సంఖ్య పెరిగింది. ప్రతి పథకంలో బయటికి కనిపించే సహాయం ఒకటి ఉంటే.. వాటికంటే దీర్ఘకాలిక లాభాలు ఎక్కువగా ఉండే ఉద్దేశంతోనే రూపొందించబడ్డాయి.

భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారనేది అవాస్తవం. చంద్రబాబుకు వేరే ఏమీ దొరకక ఇదొకటి చెపుతున్నారు. ఆయన వయసుకు, స్థాయికి ఇది తగదు. ఏదైనా నిజాలు పలకాలి. జీవిత కాలం అబద్దాలు చెప్పుకుంటూ పోవడం ఆ స్థాయికి తగదు.

చనిపోవడం అనేది ఎదో ఒక కారణాల వల్ల చనిపోతూ ఉంటారు.. దానికి అంశాలు ముడిపెట్టడం మంచిది కాదు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల వ్యవహారంలో ఒక అధికారి తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది'' అని మంత్రి బుగ్గన మీడియాతో అన్నారు.