మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 31 జులై 2018 (19:59 IST)

గవర్నర్ గారూ... ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో మీకేది ఇష్టం?

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ మంగళవారం నాడు హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూలును సందర్శించి విద్యార్థులకు తన సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి గవర్నరును... మీకు ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో ఏది ఇష్టం అని ప్రశ

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ మంగళవారం నాడు హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూలును సందర్శించి విద్యార్థులకు తన సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి గవర్నరును... మీకు ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో ఏది ఇష్టం అని ప్రశ్నించాడు. 
 
దీనితో గవర్నర్ నరసింహన్ ఆ విద్యార్థితో... నీకు నీ రెండు కళ్లలో ఏది ఇష్టం అని ప్రశ్నించారు. ఆ విద్యార్థి తనకు రెండు కళ్లూ ఇష్టమే అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు సమాధానం దొరికింది కదా... నాక్కూడా ఏపీ-తెలంగాణ రెండుకళ్లు లాంటివి. నాకు రెండు రాష్ట్రాలు ఇష్టమే అన్నారు. 
 
కాగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇదే పాఠశాలలో 1954-55 మధ్య పాఠశాల విద్యను అభ్యసించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని సంజన అభ్యర్థన మేరకు ఈ ఏడాది గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించి సందేశాన్నివ్వాల్సిందిగా కోరారు. విద్యార్థిని అభ్యర్థనను సమ్మతించిన గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరై తన అమూల్యమైన సందేశాన్నిచ్చారు.