గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 28 జూన్ 2021 (20:27 IST)

సొంత అన్నను అతికిరాతకంగా పీక కోసి చంపిన తమ్ముడు

ఆంధ్రా ఊటీ అరకులోయలో దారుణం చోటుచేసుకుంది. సొవ్వ పంచాయతీ దేవుడువలస గ్రామంలో తన స్వంత అన్నను అతి కిరాతకంగా పికకోసి అంతమొందించాడు తమ్ముడు. అన్నాను చంపిన పిదప పోలీసులకు ఎదుట లొంగిపోయాడు నిందితుడు.
 
వివరాల్లోకి వెళ్తే అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీ  దేముడువలస గ్రామంలో గత కొద్ది రోజులుగా వేములవాసుదేవ్, వేముల జగన్నాథం అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి.

తల్లిదండ్రుల నుండి  వాటా చేయాల్సిన భూములను పంచుకొనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ భూమి నాకు కావాలని ఒకరు అడిగితే అదే భూమిని నాకు కావాలని అన్నదమ్ములిద్దరూ రోజు గొడవ పడేవారు.

ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరికి వేముల జగన్నాథం అనే వ్యక్తి తన అన్నయ్య అయిన వేముల వాసుదేవ్( 30)ను పీక కోసి చంపేశాడు, ఆ తర్వాత  నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.