శ్రీవారి భక్తులకు అలెర్ట్.. చంద్రగ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత
శ్రీవారి భక్తులకు అలెర్ట్. గత నెలలో సూర్యగ్రహణం కారణంగా మూతబడిన శ్రీవారి ఆలయం.. ఈ సారి చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది.. ఈ సమయంలో 12 గంటల పాటు ఆలయం మూసివేస్తారు.
బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను అన్నీ రద్దుచేసింది టీటీడీ. గ్రహణం కారణంగా నవంబరు 8వ తేదీ తిరుపతిలో జారీ చేసే ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు చేశారు. అయితే, గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం 2 నుండి మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
8వ తేదీన మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని.. ఈ కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్టు వెల్లడించారు.