సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (22:02 IST)

హైదరాబాద్ నుంచి తిరుపతి.. గోవిందం టూర్ పేరుతో స్పెషల్ ప్యాకేజీ

tirumala
హైదరాబాద్ నుంచి తిరుపతికి గోవిందం టూర్ పేరుతో స్పెషల్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని ప్రకటించింది.  రెండు రాత్రులతో కలిపి మూడు రోజుల ఈ టూర్ ధరను రూ.4 వేల లోపే నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ స్పెషల్ టూర్ ప్రతీరోజూ అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇందులో భాగంగా శ్రీవారి స్పెషల్ దర్శనంతో పాటు తిరుచానూరును కూడా సందర్శించవచ్చు. గోవిందం టూర్ ప్యాకేజీ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మొదలై సికింద్రాబాద్ చేరుకోవడంతో ముగుస్తుంది. తిరుపతిలో హోటల్ వసతి, బ్రేక్‌ఫాస్ట్, ఏసీ వాహనంలో ప్రయాణం, శ్రీవారి స్పెషల్ దర్శనం, బీమా సౌకర్యం వుంటుంది.