గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (20:25 IST)

ఆమె అవమానం చేసిందని ఇతడు... వారు సస్పెండ్ చేశారని ఆమె సూసైడ్ అటెంప్ట్(వీడియో)

తిరుపతి రుయాలో హైడ్రామా నడిచింది. రుయాలో పనిచేస్తున్న సీనియర్ వైద్యుడు వెంకరమణను గత నాలుగురోజుల క్రితం క్లర్క్ క్రిష్ణకుమారి దూషించడంతో అవమాన భారంతో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకటరమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కొద్దిసేపటికే క్లర్క్ క్రిష

తిరుపతి రుయాలో హైడ్రామా నడిచింది. రుయాలో పనిచేస్తున్న సీనియర్ వైద్యుడు వెంకరమణను గత నాలుగురోజుల క్రితం క్లర్క్  క్రిష్ణకుమారి దూషించడంతో అవమాన భారంతో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకటరమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కొద్దిసేపటికే క్లర్క్ క్రిష్ణకుమారి కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. 
 
ఇద్దరికి రుయా ఆసుపత్రిలోని ఐసియు విభాగంలో చికిత్స నిర్వహించారు. అయితే వెంకటరమణకు మాత్రం ఇప్పటికీ ఆర్ ఐసియులో చికిత్స కొనసాగుతోంది. క్రిష్ణకుమారికి ఆరోగ్యం బాగుండడంతో ఆమెను డిశ్చార్చ్ చేశారు. జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించి యథావిథిగా పాల్గొంటున్నారు. 
 
క్రిష్ణకుమారి వ్యవహారాన్ని చిత్తూరుజిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సీరియస్‌గా తీసుకున్నారు. వెంకటరమణ ఆత్మహత్యాయత్నం తరువాత క్రిష్ణకుమారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. జాయింట్ కలెక్టర్ నిషాంత్ కుమార్‌ను రుయాకు వెళ్ళి జరిగిన సంఘటనపై రెండురోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు. విచారణ కొనసాగుతోంది. 
 
ట్రీట్మెంట్ విషయంలో క్లర్క్, వైద్యుడు మధ్య జరిగిన వివాదం కాస్త తారాస్థాయికి చేరి చివరకు ఆత్మహత్యాయత్నాలకు కారణమైంది. నాలుగురోజుల పాటు జూనియర్ డాక్టర్లు సమ్మె చేసి క్రిష్ణకుమారిని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేసినా రుయా సూపరింటెండెంట్ పట్టించుకోకపోవడంతో అవమాన భారంతోనే వైద్యుడు వెంకటరమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.