నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం, పడమర తీరంలో ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
కోస్తాలో అనేకచోట్ల బుధవారం ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. మామిడివలస(అరకువేలీ), కోటనందూరు, జియ్యమ్మవలస, ఏలేశ్వరంలలో 70, చాట్రాయిలో 57, కామవరపుకోట 53, వడ్డాది, బుచ్చయ్యపేట 52, పాచిపెంట, రంగాపురం, సీతానగరంలలో 50, దేవరాపల్లిలో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.