Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశం మారిపోతోంది.. మావోలు మారడం లేదు : అగ్రనేత జంపన్న

మంగళవారం, 26 డిశెంబరు 2017 (11:48 IST)

Widgets Magazine
jampanna couple

దేశం శరవేగంగా మారిపోతోందని, కానీ, మావోయిస్టులు మారడం లేదని పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత జంపన్న వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి పని చేయడంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. 
 
ప్రస్తుతం పార్టీ విధివిధానాలు సరిగా లేవని, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మారడంలేదన్నారు. తాను, తన భార్య సుదీర్ఘ జీవితాన్ని మావోయిస్టు పార్టీలోనే గడిపామని, దాన్ని వదలుకుని సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకుని తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయామని తెలిపారు. 
 
మావో పార్టీ నుంచి బయటకు రావడానికి ముఖ్య కారణం సైద్దాంతిక విబేధాలే అన్నారు. పీపుల్స్‌వార్ మొదలు మావోయిస్టు పార్టీ వరకు సుదీర్ఘకాలం కొనసాగిన విప్లవ జీవితమంతా ప్రజల కోసం నిజాయితీగా, నిబద్దతతో పనిచేశామన్నారు. గత 15 ఏళ్లలో అనేకమైన సామాజిక మార్పులు జరిగాయాన్నారు. ముఖ్యంగా భారత మావోయిస్టు పార్టీలో మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్దాంతాలు లేవన్నారు. పార్టీ విధానాల సమీక్షలో విఫలమైందన్నారు. 
 
పార్టీలో స్వేచ్ఛ పుష్కలంగా ఉందని, నాయకత్వం కూడా తనను పార్టీలోనే కొనసాగాలని కోరిందని, సైద్ధాంతిక విభేదాలను చర్చించుకుందామని ప్రతిపాదించిందని కానీ, పార్టీలో కొనసాగడం మానసికంగా సాధ్యంకాదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వానికి లొంగిపోవాలన్న నిర్ణయం తీసుకుని పార్టీకి తమ ప్రతిపాదన ముందు ఉంచినట్టు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్య విడాకులిచ్చిందని.. 80 మాత్రలు మింగేశాడు..

భార్యాభర్తల బంధం విడాకులతో తెగిపోయింది. భార్య విడాకులు ఇచ్చేసిందనే మనస్తాపంతో ఒకటి కాదు ...

news

అన్నయ్య స్నేహితుడని నమ్మితే... అతని ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేశాడు...

ఓ బాలిక సామూహిక అత్యాచారానికిగురైంది. అన్నయ్య స్నేహితుడే అని నమ్మి వెంట నడిస్తే అతని ...

news

కుల్‌భూషణ్ జాదవ్‌ తల, చెవి, మెడ వద్ద గాయాలు.. పాక్‌పై మండిపాటు

గూఢచర్యం చేశారనే ఆరోపణలతో మరణశిక్ష పడి.. ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో వున్న భారత నేవీ మాజీ ...

news

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... ఆపై సూసైడ్ చేసుకున్నారు.. ఎందుకు?

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ దంపతుల జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం కర్ణాటక ...

Widgets Magazine