పెళ్లి విందు : బిర్యానీ కోసం తలలు పగులగొట్టుకున్నారు...

wedding lunch clash
Last Updated: శనివారం, 18 మే 2019 (14:58 IST)
పెళ్లి భోజనం అంటే పది రకాల వంటలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యాలతో పాటు.. నాన్‌వెజ్ వంటకాలు, స్వీట్లు, గారెలు ఉంటాయి. అందుకే పెళ్లి భోజనం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పైగా, కడుపునిండా ఆరగించవచ్చు. అందుకే విందు భోజనానికి ప్రతి ఒక్కరూ పోటీపడతారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం అజ్జరం గ్రామంలోని ఓ ఇంటిలో ఏర్పాటు చేసిన పెళ్లి భోజనం కొట్లాటకు దారితీసింది. ఈ విందు భోజనంలో వేసిన చికెన్ బిర్యానీ కోసం అతిథులు ఘర్షణకు దిగారు. ఫలితంగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యారు.

ఈ వివరాలను పరిశీలిస్తే, తణుకు పాతూరుకు చెందిన వధువు తరుపు బృందం, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన వరుడి ఇంటి వద్ద వివాహ వేడుకకు శుక్రవారం ఉదయం వచ్చింది. పెళ్ళి తంతు ముగిసిన తర్వాత భోజనాలు చేస్తుండగా బిర్యానీ గురించి మాటామాటా పెరిగి వధువు, వరుడి వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు.

ఈ దాడిలో వరుడి తరుపున ఆరుగురికి, వధువు తరఫున ఆరుగురికి గాయాలయ్యాయి. పెళ్ళి మండపం వద్ద గొడవ జరుగుతోందని సమాచారం రావటంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఇరువర్గాలు కొట్టుకోవటంతో గాయాలైన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసామని ఎస్సై తెలిపారు.దీనిపై మరింత చదవండి :