మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:00 IST)

చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరుతో పార్కు.. ఏర్పడిన వివాదం.. ఘర్షణ

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ పార్

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ పార్కుకు ''చిరంజీవి-పవన్ కల్యాణ్'' అనే పేరు పెట్టాలని ఒక వర్గం పట్టుబడితే.. మరోవర్గం కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. 
 
ఈ ఘర్షణ చివరికీ దాడులు చేసేంతవరకు వెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనాయి. గాయపడిన వారిని చికిత్స కోసం తణుకు ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. 
 
ప్రస్తుతం ఉరదాళ్లపాలెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్థలంపై ఇరు వర్గాలు తమదంటే తమదేనంటూ పోటీపడటంతోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు.