ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (11:06 IST)

ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు వైద్య విద్యార్థులు మృతి...

ఉక్రెయిన్‌‍లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాతపతడ్డారు. సముద్ర స్నానం కోసం వెళ్లి వీరిద్దరు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. మృతులను హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి, కడపకి చెందిన

ఉక్రెయిన్‌‍లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాతపతడ్డారు. సముద్ర స్నానం కోసం వెళ్లి వీరిద్దరు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. మృతులను హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి, కడపకి చెందిన అశోక్‌ కుమార్‌ మారుగుత్తిలుగా గుర్తించారు. వీరిద్దరు ఉక్రెయిన్‌లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌లో చదుతున్నారు.
 
శివకాంత్‌రెడ్డి, అశోక్‌ కుమార్‌లు స్నేహితులతో కలిసి బీచ్‌లో వాలీ బాల్‌ ఆడారు. ఆ తర్వాత సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే, శివ, అశోక్‌లు రాక్షస అలల్లో చిక్కుకుని చనిపోయారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ నెల ఒకటో తేదీన సెలవులు ముగియడంతో శివకాంత్ రెడ్డి తిరిగి ఉక్రెయిన్‌ వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.