శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (15:12 IST)

రమణ దీక్షితులకు షాకిచ్చిన కేంద్రం.. అక్కడే చర్చించుకోవాలని లేఖ..

అర్చకులకు 65 ఏళ్ల నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తీసుకురావడంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆ పదవి నుంచి తప్పించారు.. టీటీడీ అధికారులు. టీటీడీ అకస్మాత్తుగా తీసుకొచ్చిన ఈ నిర్ణయం

అర్చకులకు 65 ఏళ్ల నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తీసుకురావడంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆ పదవి నుంచి తప్పించారు.. టీటీడీ అధికారులు. టీటీడీ అకస్మాత్తుగా తీసుకొచ్చిన ఈ నిర్ణయంపై రమణ దీక్షితులు మండిపడ్డారు. అంతటితో ఆగకుండా  తితిదే పాలకమండలిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 
 
శ్రీవారి మహిమల గురించి భక్తులకు చెప్పే తాను, టీటీడీ పాలక మండలి అరాచకాల గురించి చెప్పాల్సి రావడం దురదృష్టకరమని రమణ దీక్షితులు ఇటీవల వ్యాఖ్యానించారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా దేవాదాయ శాఖ కింద ఉన్న అర్చకులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు లేవని, వేలాది మంది అర్చకులు 80 ఏళ్ల వయసులోనూ విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.

అసలు అర్చకులకు పదవీ విరమణ నిబంధన పెట్టాలన్న ఆలోచనే దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో మూల విరాట్‌కు ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. 
 
భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని రమణదీక్షితులు కేంద్ర న్యాయ శాఖను ఆశ్రయించారు. అర్చక విధుల నుంచి తనను అకారణంగా తొలగించారంటూ మే 23న కేంద్ర న్యాయ శాఖకు ఫిర్యాదు చేశారు. తిరుమల వివాదంపై విచారణ జరిపించాలని కోరారు.

అయితే, రమణ దీక్షితులు ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర న్యాయ శాఖ తిరుమల వివాదం తమ పరధిలోకి రాదని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని సూచిస్తూ రమణ దీక్షితులుకు లేఖ పంపింది. రమణ దీక్షితుల ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ తోసిపుచ్చింది.