శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: గురువారం, 24 జనవరి 2019 (22:11 IST)

జగన్ రెడ్డి అలాంటివారు... వంగవీటి రాధా ఆగ్రహం... వణికిన మీడియా...

గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపిలో వున్న వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం నిజమైంది. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ... వైఎస్సార్సిపికి రాజీనామా చేసా. ఆంక్షలు లేకుండా సాగాలని పార్టీలోకి వచ్చాను. ప్రజా జీవితంలో నా తండ్రి ఆశయం ముఖ్యం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సాధ్యపడదని బయటకు వచ్చాను.
 
పార్టీలో చేర్చుకునేటపుడు తన తండ్రి ఆశయం జగన్ రెడ్డితో చెప్పాను. సొంత తమ్ముడిలా చూస్తానని అన్నారు. కానీ చాలా హీనంగా చూశారు. గత కొన్నేళ్లుగా అవమానాలు పడుతూనే భరించాను. దిగమింగుకున్నాను. అలాంటి అవమానాలు ఎవరికి జరగకూడదని అనుకున్నాను.
 
నా తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లినందుకు రాద్దాంతం చేశారు. నా తండ్రి విగ్రహావిష్కరణకు నేను వెళ్లడం తప్పా? ఎవడికి చెప్పి వెళ్తున్నావని నిలదీశారు. గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నా... వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావ్ అన్నారు. ప్రజలు నా తండ్రిని దేవుడిలా భావిస్తారు. ప్రజలు మాపై అభిమానం చూపిస్తారు.
 
పార్టీలోని పెద్దలు మాట్లాడలేని స్థితిలో వున్నారు. నన్ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీరు ఎవరినైనా బలి చేసేస్తారు. నేను పారిపోయే రకం కాదు. మీతో కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చేరాను. అది సాధ్యం కాదని రాజీనామా చేశాను అంటూ చెప్తుండగా... మీ సామాజిక వర్గానికి మాత్రమే మీరు మద్దతుగా నిలుస్తారంటూ ఓ విలేకరి ప్రశ్నించగా... రాధ ఆగ్రహంతో ఊగిపోయారు. లెట్ మీ ఫినిష్ ఫస్ట్ అంటూ అరవడంతో అక్కడున్న మీడియా వణికిపోయింది.