Widgets Magazine

అమ్మ చనిపోతే.. ఇంటి ఓనర్ ఏం చేశాడో తెలుసా?

అనారోగ్యంతో బాధపడుతూ అమ్మ మరణిస్తే.. ఆమె సంతానానికి ఇంటి ఓనర్ షాకిచ్చాడు. తల్లి మృతదేహాన్ని ఇంట్లోకి తేకూడదన్నాడు. అంతేగాకుండా ఇంటికి తాళం వేసి రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచేలా చేశాడు. కర్మకాండలు చేసేంతవ

crime photo
selvi| Last Updated: గురువారం, 21 డిశెంబరు 2017 (11:48 IST)
అనారోగ్యంతో బాధపడుతూ అమ్మ మరణిస్తే.. ఆమె సంతానానికి ఇంటి ఓనర్ షాకిచ్చాడు. తల్లి మృతదేహాన్ని ఇంట్లోకి తేకూడదన్నాడు. అంతేగాకుండా ఇంటికి తాళం వేసి రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచేలా చేశాడు.

కర్మకాండలు చేసేంతవరకు మృతురాలి కుటుంబ సభ్యులను ఇంట్లోకి రానివ్వనని తేల్చి చెప్పేశాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువస్తే తమ కుటుంబానికి కీడు జరుగుతుందని గుడ్డిగా మాట్లాడాడు.
ఇంకా పదిరోజుల తర్వాత మృతురాలి కుటుంబీకులు ఇంటిని ఖాళీ చేయాలని ఆర్డర్ ఇచ్చాడు. విజయవాడలోని విద్యాధరపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమ ఇంట్లో అద్దెకు నివసిస్తోన్న నాగమణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మృత‌దేహాన్ని ఇంట్లోకి తీసుకురానివ్వలేదు ఆ ఇంటి ఓనర్. చివ‌ర‌కు పోలీసుల జోక్యంతో ఆ య‌జ‌మాని ఇంటి తాళం ఇచ్చాడు. కానీ, కర్మకాండల ప్ర‌క్రియ అంతా ఇంటికి దూరంగానే జ‌ర‌గాల‌ని ఆర్డర్ వేశాడు.


దీనిపై మరింత చదవండి :