విశాఖ కేజీహెచ్‌లో కరోనాతో మహిళ మృతి..
విశాఖ కేజీహెచ్‌లో విజయనగరానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. అయితే జీవియంసీ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మర్రిపాలెం కరాసా శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. కాగా, తమ ప్రాంతంలో కరోనాతో మృతి చెందిన మహిళను పూడ్చి పెట్టారని తెలుసుకున్న గ్రామస్తులు జీవీయంసీ అధికారులను అడ్డుకున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గతనెల నుంచి ఇప్పటివరకూ చూస్తే... పాజిటివ్ కేసుల తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కరోనా వైరస్ సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారు.
కాగా రాష్ట్రంలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది. గత 24 గంటల్లో 8,338మంది శాంపిల్స్ పరీక్షించగా.. అందులో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది.