మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 13 జులై 2021 (10:14 IST)

బ్రిటిష్ వార‌సుడిగా జ‌గ‌న్, అందుకే తెలుగు ఖూనీ

బ్రిటీష్ పాల‌కుల‌కు వార‌సుడిగా ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అందుకే తెలుగును ఇక్క‌డ ఖూనీ చేస్తున్నార‌ని బీజేపీ  రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమ‌ర్శించారు.

అనంత‌పురంలో ఆయ‌న మీడియాతో మ‌ట్లాడుతూ, తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని చేస్తున్న ప్ర‌య‌త్నం ఇప్ప‌టికే కోర్టులో ఉంది... ఇపుడు తెలుగు అకాడమీ ని రద్దు చేసి ఖునీ చేసే ప్రయత్నాలను బీజేపీ ఖండిస్తోంద‌న్నారు. భారత ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలుగులో చదువుకొని వచ్చినవారే, అయినా రాష్ట్ర ప్రభుత్వం తెలుగును ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంద‌ని ప్ర‌శ్నించారు. 
 
తెలంగాణ ఏపీకి నష్టం జరిగే నిర్ణయాలు తీసుకుంటే, సీఎం చేతకానితనంతో ఉన్నార‌ని, రాయలసీమ హక్కులను ఫణంగా పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. అంతర్ రాష్ట్ర జలవివాదాల పై తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేయాల‌ని డిమాండు చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టు లను, విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు ఆపడం లేద‌ని ప్ర‌శ్నించారు.

రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు, హక్కులను సీఎం గాలికి వదిలేశార‌ని, సీమలో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాల‌ని విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేస్తోంద‌ని, అక్కడి ఆస్తులను గాలికి వదిలేశారు గాని ఇప్ప‌టికీ హైదరాబాద్ లో రాజధానిగా ఉమ్మడి హక్కులు ఉన్నాయ‌న్నారు.

ఇద్దరు సీఎం ల మధ్య రహస్య ఒప్పందం ఉంద‌ని ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో అవసర‌మైతే, శ్రీశైలం ను ముట్టడిస్తామ‌ని, ఇతర పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాల‌ని, జల వివాదం పై నోరు విప్పాలని డిమాండు చేశారు.