బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (07:21 IST)

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీల్లో వెయిటేజీ

ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాల్లో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన  విద్యార్థులకు వెనుకబాటు సూచీ (డిప్రివేషన్‌) కింద 0.4 పాయింట్లు కలిపేందుకు రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏటా ప్రవేశాలకు ముందు వెనుకబాటు సూచీపై ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 2017-19 వరకు మూడేళ్ల ప్రవేశాల సరాసరిని పరిశీలిస్తే గ్రామీణ విద్యార్థులకు వెనుకబాటు సూచీ కలపకపోతే 23శాతం మందికి మాత్రమే ప్రవేశాలు లభిస్తాయని జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ వెల్లడించినట్లు పేర్కొంది.

వెనుకబాటు సూచీ పాయింట్లు కలిపితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 93శాతం సీట్లు లభిస్తున్నాయని వెల్లడించింది. ఈ నేపధ్యంలో తాజా ఉత్తర్వులు జారీ చేశారు.