శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 31 ఆగస్టు 2018 (20:28 IST)

‘క్రచ్’ నిర్వహణకు ఐఏఎస్ అధికారుల సతీమణుల సంక్షేమ సంఘం ఓకే...

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యోగుల పిల్లల ప్లే స్కూల్ (క్రచ్ - CRECHE) నిర్వహణకు రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సతీమణుల సంక్షేమ సంఘం ముందుకొచ్చింది. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో ఉన్న ఉద్యోగుల పిల్లల ప్లే

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యోగుల పిల్లల ప్లే స్కూల్ (క్రచ్ - CRECHE) నిర్వహణకు రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సతీమణుల సంక్షేమ సంఘం ముందుకొచ్చింది. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో ఉన్న ఉద్యోగుల పిల్లల ప్లే స్కూల్‌ను ఆ సంఘం ప్రెసిడెంట్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ సతీమణి మోహిని గుప్తా ఆధ్వర్యంలో ఆ సంఘ సభ్యులు శుక్రవారం సందర్శించారు. సచివాలయంలోని ఉద్యోగుల పిల్లల ప్లే స్కూల్ నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా సచివాలయంలో ఉన్న ప్లే స్కూల్, కిండర్ గార్డెన్‌ను ఐఏఎస్ అధికారుల సతీమణుల సంక్షేమ సంఘం పర్యవేక్షిస్తుందని క్రచ్ నిర్వాహకులు తెలిపారు. 
 
అదే మాదిరిగా ప్రస్తుత సచివాలయ క్రచ్ నిర్వహణ బాధ్యతను చేపట్టాలని ఐఏఎస్ అధికారుల సతీమణుల సంక్షేమ సంఘం కోరారు. దీనిపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సతీమణుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మోహిని గుప్తా మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగుల పిల్లల సంరక్షణకు ప్రభుత్వం ప్లే స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. క్రచ్ నిర్వహణ బాధ్యతనే చేపడతామని హామీ ఇచ్చారు. ఆ సంఘం సెక్రటరీ, రాష్ట్ర పౌర సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సతీమణి హారిణి మాట్లాడుతూ, క్రచ్‌లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
సచివాలయ ఆవరణలో ఉన్న పార్కులో పిల్లల ఆట స్థలంగా కొంత ప్రాంతానికి కేటాయించేలా సీఆర్డీయే అధికారులతో చర్చిస్తామని ఆ సంఘం ట్రెజరర్, సచివాలయ సాధారణ పరిపాలనా విభాగం(పొలిటికల్) సెక్రటరీ నాగులాపల్లి శ్రీకాంత్ సతీమణి సౌజన్య తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. వారి పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం కచ్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మహిళా ఉద్యోగులు, క్రచ్ నిర్వాహాకులు పాల్గొన్నారు.