శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 12 జూన్ 2018 (19:15 IST)

సీఎం చంద్రబాబు నాయుడుపై అకస్మాత్తుగా పోసాని ఎందుకలా ఫైర్ అయినట్లు?

నటుడు, రచయిత పోసాని క్రిష్ణమురళి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను ఏకిపారేసిన విషయం తెలిసిందే. పదవి కోసం చంద్రబాబు నాయుడు ఎవరినైనా చంపేస్తాడు. ఆ బుద్ధులే నారా లోకేష్‌‌కు వచ్చాయి. నారా కుటుంబంతో జాగ్రత్తగా ఉండాలి అంటూ పోసాని క

నటుడు, రచయిత పోసాని క్రిష్ణమురళి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను ఏకిపారేసిన విషయం తెలిసిందే. పదవి కోసం చంద్రబాబు నాయుడు ఎవరినైనా చంపేస్తాడు. ఆ బుద్ధులే నారా లోకేష్‌‌కు వచ్చాయి. నారా కుటుంబంతో జాగ్రత్తగా ఉండాలి అంటూ పోసాని క్రిష్ణమురళి సంచలన వ్యాఖ్యలు  చేశారు. అంతటితో ఆగలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయ పరిపక్వత లేకుండా జెండా పీకేశారంటూ చిరంజీవి పైన కామెంట్లు చేసి ఆయన్నీ వదిలిపెట్టలేదు. 
 
అలాగే పవన్ కళ్యాణ్‌‌ను పొగుడుతున్నట్లుగానే విమర్శలు చేశారు. తను రాజకీయాల్లోకి రానని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయనని చెబుతూనే పోసాని క్రిష్ణమురళి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ అవినీతికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు, కోర్టులు నిరూపణ కాలేదు కదా... జగన్ అవినీతిపరుడన్నది నిజమో కాదో మనకు తెలియదు. కానీ నువ్వు ప్రతిచోటా జగన్ అవినీతీపరుడంటూ ఏదేదో మాట్లాడేస్తున్నావు. నీ దగ్గర ఆధారాలున్నాయా.. చూపించు అంటూ సవాల్ విసిరారు పోసాని క్రిష్ణమురళి. 
 
పోసాని ఇలా రెచ్చిపోవడానికి బిజెపి నేతల సపోర్టేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బిజెపితో టిడిపి విడిపోయిన తరువాత బాబుపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలన్న రకరకాల ప్రయత్నాలు చేస్తోంది బిజెపి. అందులో భాగంగానే పోసాని క్రిష్ణమూర్తికి డైరెక్షన్ ఇచ్చి చంద్రబాబుపై విమర్శలు చేయమని బిజెపి నేతలే పంపారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద బిజెపి నేతల డైరెక్షన్లో పోసాని క్రిష్ణమురళి యాక్షన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.