Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తరగతి గదిలో పొడిచి.. పొడిచి.. ఉపాధ్యాయురాలి హత్య.. హంతకుడు కూడా టీచరే..

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (11:14 IST)

Widgets Magazine
murder

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఓ టీచర్ దారుణ హత్యకు గురైంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాలలో రక్తం పారింది. తరగతి గదిలోనే చిన్నారుల కళ్ల ముందే ఓ ఉపాధ్యాయురాలిని తోటి ఉపాధ్యాయుడే అతి దారుణంగా పొడిచి పొడిచి హత్య చేశాడు. 
 
ఈ సంఘటనతో భీతావహులైన పిల్లలు తలోదిక్కుకూ పరుగులు తీశారు. ఈ దారుణ సంఘటన గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువాళ్లపేట పాఠశాలలో గురువారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ పాఠశాలలో ప్రేమకుమారి, గంగాపురం పాఠశాలలో చంద్రమౌళి అనే ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. వీరిమధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం జరుగుతున్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రేమకుమారి ఇతరులతో చనువుగా ఉంటోంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రవౌళి గురువారం పాఠశాలలోనే ఆమెపై కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచి పొడిచి చంపాడు. గతంలోనూ వీరిద్దరికీ గొడవలు జరిగాయని, ఇటీవల వీరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారని తెలిసింది.
 
కాగా, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... వీరిద్దరూ వివాహితులే కావడం గమనార్హం. ప్రేమ కుమారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడు చంద్రవౌళి గతంలో రియల్ ఎస్టేట్, ఇసుక, ట్రాన్స్‌పోర్టు వ్యాపారాలు నిర్వహిస్తుండేవాడు. కేవలం తన ప్రేయసి కోసం భార్యకు విడాకులు ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'ఏ ఫర్ అమ్మ.. బి ఫర్ బాయ్'... బెంగుళూరు జైలులో చిన్నమ్మ అంగ్ల పాఠాలు

అక్రమాస్తుల కేసులో శిక్షపడి బెంగుళూరు జైలులో ఉంటున్న శశికళ ఆంగ్ల పాఠాలు నేర్చుకుంటుందట. ఏ ...

news

చంకనేసుకుని పొలంగట్లకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై బురదలో వేసి తొక్కేశాడు...

వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి ...

news

ఉరి తీయలేరు కదా.. మహా అయితే, జైలుకు పంపుతారు : టీటీవీ దినకరన్

తనపై నమోదవుతున్న కేసులపై అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ స్పందించారు. ...

news

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తాడట... 'జబర్దస్త్' కామెడీ కంటే లోకేష్ కామెడీ చాలా బాగుంది : రోజా ఎద్దేవా

రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ...

Widgets Magazine