ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 18 ఏప్రియల్ 2018 (21:46 IST)

యలమంచిలికి మేకపాటి, విజయసాయి అభినందనలు

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ యలమంచిలి రవి బుధవారం పార్టీ అగ్ర నాయకులను కలిశారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరిన యలమంచిలి రవిని వెంటనే నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం వ

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ యలమంచిలి రవి బుధవారం పార్టీ అగ్ర నాయకులను కలిశారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరిన యలమంచిలి రవిని వెంటనే నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం వైసిపి నేతలను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
 
నేతలు విజయసాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా యలమంచిలిని అభినందిస్తూ, మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. రవి రాకతో బెజవాడలో విభిన్న వర్గాలు వైసిపి వైపు చూస్తున్నాయని అభిప్రాయ పడ్డారు.