Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.... చాలా తెలివైన వాళ్లు: జేసీ దివాకర్ రెడ్డి

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (15:49 IST)

Widgets Magazine

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో వున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.. చాలా తెలివైన వాళ్లంటూ కౌంటర్ ఇచ్చారు. తాను కూడా పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డితో మాట్లాడతానని.. అయినంతమాత్రానికి వాళ్లతో టచ్‌లో వున్నట్లవుతుందా అంటూ ప్రశ్నించారు. 
 
విజయసాయిరెడ్డిని చూస్తే బాగున్నారా అంటూ పలకరిస్తా.. ఎంపీలందరితోనూ మాట్లాడుతా.. వాళ్లతో కలిసి కాఫీ తాగుతూ.. వారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకుంటా. అయినంత మాత్రానికే పార్టీ మారుతున్నట్టా? అంటూ జేసీ అడిగారు. వైకాపా నేతలతో మాట్లాడినంత మాత్రానా పార్టీ మారుతున్నట్లవుతుందా? ఎమ్మెల్యేలు చాలా తెలివైన వాళ్లని జేసీ చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీ వాళ్లను జగన్ తీసుకుంటాడని తెలుసు. అర్హులు కాని వాళ్లకు, ప్రజలతో సంబంధం లేనటువంటి వాళ్లకు.. అవినీతిపరులకు టిక్కెట్లు ఇవ్వనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ చెప్తూనే వున్నారు. అలాంటప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కొందరు జగన్ దగ్గరకు వస్తారు. వాళ్లకు వైకాపా టిక్కెట్లు ఇవ్వమని జేసీ ఎద్దేవా చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మమ్మ ఇంటికెళ్లి వస్తానంది.. మైలారం రైల్వేస్టేషన్ వద్ద?

అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి వెళ్ళిన ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద రీతిలో మృతి ...

news

చీరకట్టులో ప్రియా వారియర్.. ఫిదా అయిన నెటిజన్లు.. ఫోటో

సోషల్ మీడియాలో ప్రియా వారియర్ ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ...

news

టిడిపిలోకి మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి... ఏ పదవిస్తారో తెలుసా..?

మాజీ సిఎం కిరణ్‌ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా.. వచ్చే ఎన్నికల్లో ఎంపిగా ...

news

చెట్ల పొదల్లో వికలాంగురాలిని ముగ్గురు కలిసి....

మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు ...

Widgets Magazine