ఇక బహుజన అమరావతి: ఆళ్ల రామకృష్ణారెడ్డి  
                                       
                  
				  				   
				   
                  				  తెదేపా చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పచ్చ మీడియాలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన మీడియాలో మాట్లాడుతూ... ఇకపై అమరావతి సర్వజన అమరావతి. అరలక్షకు పైగా కుటుంబాలకు.... రెండు లక్షల ప్రజలకు కొత్తగా ఆశ్రయం కల్పిస్తున్న అమరావతి. అమరావతిలో ఎస్సీ, ఎస్టి బిసి మైనారిటీలు, ఇతర కులాల్లో నిరుపేదలకు సంబంధించి 54 వేల కుటుంబాలకు ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు.
				  											
																													
									  
	 
	మొత్తం 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు బాధేంటి. ఇళ్ల స్థలాలపై చంద్రబాబు అనవసరంగా రాధ్దాంతం చేస్తున్నారు. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రాజధానిలోకి పేదలెవ్వరూ రానివ్వకూడదని చంద్రబాబు కుట్ర.
				  
	 
	రాజధానిలో చంద్రబాబు లాంటి గొప్పవాళ్లే ఉండాలా. అమరావతి అందరి రాజధానిగా మారబోతోంది. రాజధాని విషయంలో చంద్రబాబు అన్యాయంగా మాట్లాడుతున్నారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 చంద్రబాబు తాను చేసిన వాగ్దానాలను విస్మరించారు. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. పచ్చ మీడియా చంద్రబాబుకు దాసోహమైంది. పచ్చ మీడియా ద్వారా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు.
				  																		
											
									  
	 
	రాష్ట్రంలో బలవంతంగా భూసేకరణ జరగడం లేదు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు పచ్చ మీడియాలో రాయిస్తున్నారు. రాజధాని పేరుతో ఎన్నో దుర్మార్గాలు చేశారు. ఇళ్లు లేని పేదల కోసమే భూముల కేటాయింపులు అని అన్నారు.