Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆడపిల్లలు లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఎంత దారుణంగా ఉంటుందో... రోజా కామెంట్స్

శనివారం, 10 మార్చి 2018 (16:22 IST)

Widgets Magazine
rk roja

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి అని వైసీపీ ఎమ్మెల్యే రోజా త‌న‌దైన శైలిలో ఫైర్ అయ్యారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్లు కొనిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేసారు. చంద్రబాబు నాయుడి మానిఫెస్టో ఒకసారి అందరూ చూడాలని, చదువుకునే ఆడపిల్లలకి ఐ ప్యాడ్లు ఇస్తామని, అవి వారి చదువుకు ఉపయోగపడతాయని అన్నారని తెలిపారు. 
 
బాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు... తన చివరి బడ్జెట్లో మహిళలకు ఏం చేశారు అని ప్ర‌శ్నించారామె. అలాగే.. గవర్నర్ ప్రసంగంలో కూడా మహిళల గురించి ఒక్క మాట కూడా పెట్టలేదు. డ్వాక్రా రుణాలకు బాబు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మూలకి వస్తాయి. బెల్ట్ షాప్‌లు విషయంలో బాబు ప్రభుత్వం తీరు బాధాకరం. ఆడపిల్లలు లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎంత దారుణంగా ఉంటుందో బాబు చూపిస్తున్నారు అంటూ ఆరోపించారు. 
 
చంద్రబాబు మహిళా వ్యతిరేకి. ఆడపిల్లలకు ఐ పాడ్స్ ఇస్తాన్నారు. కానీ 50% రాయితీ ఆడవాళ్ళ సానిట్రీ పాడ్స్‌పై యిచ్చారు. బాబుకి ఐ పాడ్స్‌కి సానిట్రీ పాడ్స్‌కి తేడా తెలీదా అని ప్ర‌శ్నించారు. మహిళ దినోత్సవం రోజు బాబు చేసిన ట్వీట్ చాలా చవుకబారుగా ఉంది. మీ ఇంట్లో ఆడవాళ్లు బాగుంటే రాష్ట్రంలో మహిళ సాధికారత అనుకుంటే ఎలా బాబు అంటూ ప్రశ్నించారామె. మహిళల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని మ్యానిఫెస్టోలో చెప్పారు. కానీ మహిళ భద్రత విషయం గాలికొదిలేశారు. టీడీపీ రౌడీలు ఈ రోజు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అంటూ త‌న‌దైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైసిపీ ఎమ్మెల్యే రోజా.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్యాంక్ బండ్ క్లోజ్... మిలియన్ మార్చ్ దడ... కోదండరాం కామెంట్స్

ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అనుమతి ఇవ్వక పోవటం నిరంకుశ పాలనకు నిదర్శనం ...

news

''మిలియన్ మార్చ్''‌ ఉద్రిక్తత: తెలంగాణ సర్కారుకు వణుకు.. కోదండరాం

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ''మిలియన్ మార్చ్''‌కు అప్పట్లో లక్షలాది జనం తరలివచ్చారు. తెలంగాణ ...

news

థర్డ్ ఫ్రంట్.. కేసీఆర్, చంద్రబాబు, వెంకయ్య.. వీరిలో ప్రధాని ఎవరు?

థర్డ్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. స్వేచ్ఛాధికారమే అజెండాగా ...

news

వైకాపా ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్.. టీడీపీలోకి వస్తే.. ఆ రెండు పదవులు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగు దేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు ...

Widgets Magazine