గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (19:09 IST)

యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి: మంత్రి పేర్ని నాని

యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించు కోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని ) సూచించారు.

ఆదివారం మచిలీపట్నం స్థానిక ఉల్లింగిపాలెం (23వ వార్డు)లో యువతకు క్రికెట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు.

మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మెన్ మోకా భాస్కరరావు నిర్వహణలో తన కుమారుడు తేజ మహేష్ స్మారకార్థం పలు జట్లకు క్రికెట్ కిట్లను అందచేశారు.

స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సామాగ్రిని అందించిన మోకా భాస్కరరావు అందచేసిన బహుమతి వెల కట్టలేనిదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

అనంతరం మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మెన్ మోకా భాస్కరరావు మాట్లాడుతూ,  రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, అలాగే సోమవారంతో మన ప్రియతమ  పేర్ని నాని మంత్రిగా సంవత్సరకాలంగా అద్భుత పాలన అందిస్తూ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జనరంజక పాలనతో దేశంలో 29 మంది ముఖ్యమంత్రులతో సమర్థవంతుడైన నాల్గవ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించుకొన్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ షేక్ ముస్తఫా, మాజీ జెడ్ పి టీ సి లంకె వెంకటేశ్వరరావు, వార్డు ఇంచార్జ్ లు పరిమకాయల విజయ్, కొలుసు హరిబాబు, చింతా గిరి, బ్యాగ్ వర్క్స్ తాళగంటి రమేష్ బాబు, సతీష్ తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.