మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 జనవరి 2018 (13:02 IST)

జగన్ పాదయాత్ర ... 900 కిలోమీటర్లు పూర్తి

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది.

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను జగన్ నాటారు. 
 
కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా వేల సంఖ్యలో యువత, మహిళలు, రైతులు, చేతి వృత్తుల వారు జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. 
 
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేల సంఖ్యలో యువకులు, మహిళలు జగన్‌కు మద్దతుగా ఆయనతో కలసి అడుగులో అడుగేస్తున్నారు. ఊరూరా సందడి వాతావరణం నెలకొంది. కొండలు.. కోనలు.. అడవులు.. కరువు నేలల మీదుగా పాదయాత్ర సాగిస్తున్న జగన్‌కు అడుగడుగునా ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. 
 
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ కష్టాలు వినే నాయకుడొచ్చాడని  ఘన స్వాగతం పలుకుతున్నారు. వీరి సమస్యలన్నింటినే ఎంతో ఓపికగా వింటూ, మనం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను తీరుస్తానంటూ భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు.