గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (16:32 IST)

గోదాదేవి దేవదాసి: వైరముత్తు అనుచిత వ్యాఖ్యలు-బీజేపీ మండిపాటు

విష్ణుమూర్తి చింతననే మనస్సున నిలుపుకున్న విష్ణుచిత్తునికి తులసీ వనంలో లభించింది గోదాదేవి. ఆమె విష్ణుసేవనే పరమధ్యేయంగా భావించి ఆయనపై ప్రేమను పెంచుకుంది. తదనంతరం విష్ణుమూర్తినే వివాహమాడిన గోదాదేవి.. శ్ర

విష్ణుమూర్తి చింతననే మనస్సున నిలుపుకున్న విష్ణుచిత్తునికి తులసీ వనంలో లభించింది గోదాదేవి. ఆమె విష్ణుసేవనే పరమధ్యేయంగా భావించి ఆయనపై ప్రేమను పెంచుకుంది. తదనంతరం విష్ణుమూర్తినే వివాహమాడిన గోదాదేవి.. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో నాయిక. గోదాదేవి పండగ నెలంతా ఉపవాసముండి.. నిష్ఠతో విష్ణుమూర్తి మనువాడింది.
 
అందుకే ధనుర్మాస ఉత్సవాలను అనేక ఆలయాల్లో నిర్వహిస్తారు. భోగి పండున రోజున గోదాదేవి, రంగనాథ స్వామి వార్ల వివాహ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాంటి గోదాదేవి పట్ల తమిళ రచయిత వైరముత్తు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోదాదేవిపై వైరముత్తు ఓ పత్రికకు రాసిన వ్యాసం దుమారం రేపుతోంది. ఇలా దేవతామూర్తిగా పూజలందుకుంటున్న గోదాదేవి ప్రతిష్టను దిగజార్చేలా ఆ వ్యాసం వుందని తమిళనాడు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 
దేవతామూర్తిగా తమిళుల చేత పూజలందుకుంటున్న గోదాదేవిని దేవదాసిగా వ్యాఖ్యానించడం సరికాదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. తన వాఖ్యల పట్ల వైరముత్తు విచారం వ్యక్తం చేస్తే సరిపోదన్నారు. సదరు వ్యాస్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.