శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (14:20 IST)

కర్నూలు కొత్త బస్టాండు వద్ద వ్యభిచారం.. జైలుశిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న కొత్త బస్టాండు వద్ద విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇటీవల అక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న కొత్త బస్టాండు వద్ద విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇటీవల అక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు యువకుల పాటు 18 మంది వ్యభిచారిణులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతున్న విషయం తెల్సిందే. అనేక ప్రాంతాల్లో వ్యభిచారం సాగుతోంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో పాటు.. ఏపీ కొత్త రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ విషయం పోలీసులు నిర్వహించిన సోదాల్లో నిరూపింతమైంది కూడా.