శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:31 IST)

ఆయనంత మూర్ఖుడు లేరు? రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారో చూస్తా: జగన్

నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల విజయం ఏ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయం అవుతుందో చెప్పాలన్నారు. నంద్యాల గెలుపు బాబుది కాదని.. అ

నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల విజయం ఏ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయం అవుతుందో చెప్పాలన్నారు. నంద్యాల గెలుపు బాబుది కాదని.. అది బాబు గెలుపనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకెవరుండరన్నారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు సవాలు విసిరారు.
 
వైకాపా నుంచి గెలుపొందిన 20 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. ఆ ఎన్నికల్లో రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడ్తారో చూస్తానన్నారు. రాజకీయాల్లో గుండె ధైర్యం వుండాలని.. ఎన్నికల్లో అవతలి వ్యక్తి ఎంత గట్టిగా కొట్టాడో....అంత గట్టిగా తీసుకోగలుగుతానో రేపటి విజయానికి నాంది అన్నారు. చంద్రబాబుకు భయపడి ప్రజలు ఓటేశారని జగన్ వ్యాఖ్యానించారు.
 
రేషన్ కార్డుల నుంచి కరెంట్ బిల్లుల వరకు ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్ విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావనే కారణంతోనే టీడీపీ గెలిచిందన్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.