Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్టోబర్ 27 కలిసిరాదు.. అందుకే జగన్ పాదయాత్ర వాయిదా.. నవంబర్ 2న ప్రారంభం?

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (13:25 IST)

Widgets Magazine
ys jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలనుకున్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే నంద్యాల, కాకినాడ ఎన్నికలు ఆశించిన స్థాయిలో ఆయనకు మంచి ఫలితాలను ఇవ్వకపోవడంతో జగన్ రెడ్డి.. ప్రజల దగ్గరకు వెళ్లాలనుకున్నారు. 
 
అక్టోబర్ 27 మంచి రోజు కాదని.. ఆనాడు పాదయాత్ర మొదలెడితే ప్రతికూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరించడంతో జగన్ పాదయాత్ర తేదీపై నిర్ణయం మార్చుకున్నారు. ఈ మేరకు నవంబర్ ఒకటో తేదీ లేదా నవంబర్ రెండో తేదీన ఆరంభించాలని డిసైడ్ అయ్యారు. 180 రోజుల పాటు జగన్ చేపట్టదలచిన పాదయాత్రను అక్టోబర్ 27న చేపడితే కాలి నొప్పులే మినహా.. సీఎం పోస్టు అందని ద్రాక్షలా మిగిలిపోతుందని జ్యోతిష్కులు హెచ్చరించడంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు పాదయాత్ర చేపట్టాల్సి ఉన్నందున ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. పాదయాత్ర పేరిట కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు జగన్ ఎత్తు వేశారని కోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో యాత్రకు ప్రతి శుక్రవారం విరామం ఇచ్చి కోర్టుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాగే సీబీఐ కేసు నుంచి తన పేరు తొలగించాలన్న అభ్యర్థనపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడుకు 'అచ్చే దిన్' రాలేదు... కాషాయ రంగు రజనీకి సూటవుతుంది...

విశ్వనటుడు కమల్ హాసన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు ఇంకా అచ్చే దిన్ ...

news

డేరా బాబా నా భర్త కాదు.. నాకు తండ్రిలాంటివారు : హనీప్రీత్

డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు భర్త కాదనీ, తనకు తండ్రిలాంటివారని డేరా బాబా ...

news

ప్రత్యేక పూజల పేరుతో వివాహితపై పూజారి అత్యాచారయత్నం

వ్యాపారంలో వచ్చిన నష్టాలను అధికమించి తిరిగి లాభాలను గడించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని ...

news

ఢిల్లీలో హనీప్రీత్ సింగ్: ముందస్తు బెయిల్ కోసం పిటిషన్...

డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ నేపాల్‌లో లేదని తేలిపోయింది. అంతేగాకుండా ...

Widgets Magazine