గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (11:55 IST)

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు: నిద్రలోనే గంగాధర్‌ రెడ్డి మృతి

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న గంగాధర్‌ రెడ్డి తాజాగా మరణించాడు. 
అనంతపురం జిల్లా యాడికిలో గంగాధర్‌ మరణించాడు. వివేకా హత్య కేసులో.. ఇప్పటికే గంగాధర్‌ రెడ్డిని సీబీఐ విచారణ చేసింది.  
 
నిందితుడు దేవిరెడ్డి శంకర్‌ రెడ్డికి గంగాధర్‌ రెడ్డి అనుచరుడు. ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో గంగాధర్‌ రెడ్డి ఉండేవాడు. స్వగ్రామం పులివెందుల నుంచి యాడికి వచ్చిన గంగాధర్‌ రెడ్డి.. ప్రాణముప్పు ఉందని రెండు సార్లు ఎస్పీని కలిశారు.
 
రక్షణ నిమిత్తం అనంతపురం ఎస్పీని ఇప్పటికే గంగాధర్‌ రెడ్డి కలిశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ ఎస్పీకి గతంలో ఫిర్యాదు చేశాడు గంగాధర్‌ రెడ్డి. 
 
ఇక తాజాగా గంగాధర్‌ రెడ్డి రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.