మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (09:51 IST)

వైఎస్ జగన్ అసలు రెడ్డే కాదు.. రాజారెడ్డి ఆ పని చేసేవారు.. బైరెడ్డి

By Reddy
By Reddy
తిరుమల దేవస్థానం(టీటీడీ)ని వైఎస్‌ సహా గత పాలకులు మోసం చేసిన విశిష్ట సంస్థ అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బైరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. టీటీడీ పవిత్రతను, ఆస్తులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
వైఎస్ జగన్ అసలు రెడ్డే కాదంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తాత రాజారెడ్డి.. బ్రిటీషర్లకు గొడ్డు మాంసం సరఫరా చేసేవారంటూ బైరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "వైఎస్ జగన్ కులం, మతం మీద చర్చ జరగాలి. ఇంత జరిగిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేందుకే జగన్, ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్, నాస్తికులు ప్లాన్ ప్రకారం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న వందల దేవాలయాలపై దాడులు జరిగాయి." అని బైరెడ్డి తెలిపారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను జగన్ మోహన్ రెడ్డి దెబ్బతీశారని, తిరుపతి లడ్డూను కల్తీ చేయడంపై బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ హయాంలో శ్రీశైలం లడ్డూలో భక్తులకు కోడి ఎముకలు దొరికిన ఘటనను గుర్తు చేస్తూ ఇలాంటి సమస్యలకు జవాబుదారీతనం లేకపోవడాన్ని ఎత్తిచూపారు.