బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (17:12 IST)

వైసీపీలోకి రాధా? జగన్ రాధను సొంత తమ్ముడిలా చూసుకున్నా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసీపీలోనే ఉండిపోయింది. 
 
విజయవాడ నగర వాసుల కళ అయిన కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో రాధా పార్టీ మారిపోయారు. జగన్ రాముడైతే నేను లక్ష్మణుడులా ఉన్నానని రాధా జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.
 
అయితే జగన్ ఎప్పుడు రాధను సొంత తమ్ముడిలా చూసుకున్నా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంగవీటి రంగా కాంబినేషన్ ఇప్పుడు జగన్ రాధాలా మాదిరిగా ఉందని అందరూ అనుకున్నారు. అయితే పార్టీ నుండి వెళ్ళిపోయినా రాధ మళ్ళీ తిరిగి తన సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. 
 
తన అన్నయ్య జగన్‌కు ఎలాగైన ఒప్పించి వైసీపీలోకి వెళ్ళిపోతారు అని చంద్రబాబును నమ్మి మోసపోయానని చెప్పారట. ప్రస్తుతం వైసీపీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అవసరం. అలాగే రాధా తప్పటడుగులు వేసినా రంగాపై ఉన్న అభిమానం పార్టీకి ఉపయోగపడుతుందని కొందరు జగన్‌కు సూచించారట. అన్ని కుదిరితే మరికొద్ది రోజుల్లోనే రాధా తిరిగి జగన్ చెంతకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.