సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (12:46 IST)

పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ సరికొత్త రికార్డు - ఫ్యాను ప్రభంజనం...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్థరాత్రి దాటాక పూర్తయింది. రాత్రి రెండు గంటల సమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. 
 
రాష్ట్రంలో మొత్తం 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో అధికార వైకాపా ఏకంగా 5,998 స్థానాల్లో విజయభేరీ మోగించింది. అలాగే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అభ్యర్థులు కేవలం 826 స్థానాలకే పరిమితమయ్యారు. 
 
ఇకపోతే, జనసేన 177, బీజేపీ 28, సీపీఎం 15, సీపీఐ 8, స్వతంత్రులు 157 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే, 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ 502, టీడీపీ 6, జనసేన 2, జనసేన, సీపీఎం, స్వతంత్రులు చెరో స్థానాల్లో విజయం సాధించారు.