ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జులై 2024 (10:29 IST)

ఏపీకి ప్రత్యేక హోదా ఖాయం.. ఇవ్వకపోతే టీడీపీ అలా చేస్తుంది..?

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎన్డీయే నుంచి టీడీపీ కచ్చితంగా వైదొలగుతుందని భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. 
 
న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యానని, ఏపీలో దెబ్బతిన్న శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై మాట్లాడానని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమన్నారు. 
 
అయితే ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాత్రం ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకోవడం ఖాయమన్నారు. లోపాయికారీ ఒప్పందాలు లేకపోతే మాత్రం ఈసారి ఏపీకి ప్రత్యేక హోదా లభించడం సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే టీడీపీ ఇవేవీ పట్టించుకోవడానికి సిద్ధంగా లేదన్నారు.