Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేసేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

బుధవారం, 11 అక్టోబరు 2017 (13:37 IST)

Widgets Magazine
ys jagan

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగిన 10వ యువభేరీ కార్యక్రమంలో పాల్గొన ఆయన మాట్లాడుతూ హోదాపై సీఎం చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేయడం లేదని విమర్శించారు. హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రెండు బంద్‌లకు పిలుపు ఇచ్చిందని.. ఆ బంద్‌లకు ప్రభుత్వం మద్దతు తెలపలేదని గుర్తు చేశారు. 
 
బంద్ జరిగితే ప్రత్యేక హోదా వస్తుందని అందరం ఆరాటపడుతుంటే... బంద్ ఎలా విఫలం చేయాలని చంద్రబాబు ఆలోచనలు సాగాయని జగన్ విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత జగన్ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 
 
ఇప్పుడే రాజీనామా చేయడంలో అర్థం లేదని, తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్‌లో మాట్లాడేవారే ఉండరని ఓ ప్రశ్నకు సమాధానంగా వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన తర్వాత, తమ పదవులకు రాజీనామా చేస్తే ఉపయోగం ఉంటుందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, జగన్ చెప్పిన వెంటనే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హనీప్రీత్ సింగ్ చెప్పును కూడా వదల్లేదు.. ఫోటో తీసిన మీడియా.. సెల్ఫీల కోసం..

డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ...

news

గుండెలు పిండేసే ఘటన... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా....

భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను ...

news

పూనకం పట్టినట్టు ఊగిపోయిన విమానం.. ఎందుకు (Video)

సాధారణంగా విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తంత భయభ్రాంతులకు గురిచేస్తాయి. అదే ...

news

భారత్‌పై అణు బాంబులతో దాడికి సిద్ధమవుతున్న పాకిస్థాన్?

భారత్‌పై అణు బాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివిధ అంశాలపై ...

Widgets Magazine