గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-01-2020 -బుధవారం నూతన సంవత్సరం తొలిరోజు రాశి ఫలితాలు

శ్రీ మన్నారాయణుడి తులసీ దళాలతో ఆరాధించినట్లైతే శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: బంధుమిత్రులను విందుకు ఆహ్వానిస్తారు. వృత్తివ్యాపారాలు విస్తరిస్తాయి. ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నూతన వ్యక్తులను కలుసుకుని వారికి బహుమతులు అందజేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిథునం: బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతారు. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధికమించి ముందుకు సాగుతారు. విదేశీ యత్నాల్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తారు. పరిస్థితులన్నీ అనుకూలంగా సాగుతాయి. రావలసిన ధనం చేతికి అందడంతో ఖర్చులు అధికమవుతాయి. 
 
కర్కాటకం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. కంది, మిర్చి, నూనె, ధాన్యం, అపరాలు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి.
 
సింహం: విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్త్రీలు దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది.
 
కన్య: ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. రాజకీయ నాయకులకు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుంచి అవమానాలు ఎదుర్కొంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
తుల: ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి, వస్తులాభం వంటి శుభ ఫలితాలున్నాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం.
 
వృశ్చికం: శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వేడుకలు, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు: ఉపాధ్యాయులకు సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం.
 
మకరం: పత్రికా సంస్థల్లోని వారికి పనిభారం, ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులు క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కుంభం: ఫ్యాన్సీ, బేకరీ, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సంతానం వల్ల ఆనందం, ఉత్సాహం పొందుతారు. ప్రత్యర్థుల విషయంలో ఏమరుపాటుతనం కూడదు. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. 
 
మీనం: వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం కానరాగలదు. కావలసిన వస్తువు సమయానికి కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్థిర చిత్తంతో వ్యవహరించడం క్షేమదాయకం.