సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (08:49 IST)

27-04-2021 మంగళవారం దినఫలాలు - హనుమంతుని ఆరాధించడం వల్ల..

మేషం : మీ ఉన్నతిని చూసి ఆసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులకు స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచివుండాల్సి వస్తుంది. 
 
వృషభం : బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. 
 
మిథునం : కుటుంబ సమస్యలు, వ్యాపార లాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ మాటతీరు మన్ననలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బాకీలు, ఇతరాత్రా రావలసిన ఆదాయం అందుతుంది. 
 
కర్కాటకం : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. 
 
సింహం : మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో అధిక ఒత్తిడి, చికాకులు, ఇబ్బందులు తప్పవు. బంధువులతో చికాకులు తలెత్తుతాయి. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. రావలసిన ధనం అందకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. 
 
కన్య : వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెడుతాయి. సోదరీ, సోదరుల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు తగదు. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు. 
 
తుల : స్థిరాస్తి క్రయ, విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కష్టసమయంలో ఆత్మీయులు చేదోడు, వాదోడుగా నిలుస్తారు. తోటల రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. 
 
వృశ్చికం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకుల కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
ధనస్సు : మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రత్యర్థులు సైతం మీ ఔన్యత్యాన్ని గుర్తిస్తారు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
మకరం : వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు పథకాలు సత్ఫలితాలనిస్తాయి. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
కుంభం : తోటివారి సహకారం వల్ల పాత సమస్యలు పరిష్కరించబడతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. 
 
మీనం : రాజకీయ కళా రంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. దంపతుల మధ్య కలహాలు పట్టింపులు ఎదుర్కొంటారు. మీ సంతానంతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. అప్రమయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. కొబ్బరి, పండ్లు, పానీయ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఖర్చులు అధికమవుతాయి.