సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 05-02-2023 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివితే సర్వదా శుభం

Libra
మేషం :- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. రవాణా రంగంలోని వారికి లాభదాయకం.
 
వృషభం :- రిప్రజెంటివ్‌లు మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలు ఎటువంటి ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో వ్యవహరించటం అన్నివిధాలా శ్రేయస్కరం. 
 
మిథునం :- ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిపని చేతిదాకా వచ్చి వెనక్కి పోవడం వల్ల నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు.
 
కర్కాటకం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త అవసరం.
 
సింహం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. రాజకీయ నాలు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కన్య :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకులు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులను నుంచి అపనిందలు, అవమానాలు వంటివి ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహరాలలో ఇబ్బందులు తప్పవు.
 
తుల :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొంటారు. గృహమునకు కావలసిన మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వ్యాపార రంగాల వారికిపురోభివృద్ధి కానవస్తుంది.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. విరామ కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు.
 
మకరం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా భాగస్వామికుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. స్త్రీలకు గృహ వాతావరణం, సంతానం వైఖరి వల్ల ఆందోళనలు అధికమవుతాయి. ఆదాయానికి కొదవ ఉండదు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
కుంభం :- నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీల పనులు వాయిదా వేసుకుంటారు. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళుకువ అవసరం. దైవ దర్శనాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
 
మీనం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొంటారు. రుణ దాతలతో కలహించక సర్దిచెప్పేందుకు యత్నించాలి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం మిమ్మల్ని వరిస్తుంది.