గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-03-2024 బుధవారం దినఫలాలు - వృత్తి నైపుణ్యం పెంచుకోవటానికి కృషి చేయండి...

astro6
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ ఐ|| ఏకాదశి రా.12.07 పూర్వాషాఢ ఉ.10.48 సా.వ.6.28 ల 8.01. ప. దు. 11.48 ల 12.34.
 
మేషం :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఎవరినీ అతిగా విశ్వసించటంమంచిది కాదు.
 
వృషభం :- వృత్తి నైపుణ్యం పెంచుకోవటానికి కృషి చేయండి. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులు పురోభివృద్ధి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
మిథునం :- రవాణా రంగంలోవారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సంబంధాలు బలపడతాయి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విందు, వినోదాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు అధికమైనా సంతృప్తి కానవస్తుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
సింహం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసివస్తుంది.
 
కన్య :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. మీ శ్రీమతితో అకారణ కలహం, పట్టింపులు ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
తుల :- బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. దంపతుల సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఒక సమస్య పరిష్కారం కావటంతో మనస్సు తేలికపడుతుంది. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదు.
 
వృశ్చికం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. 
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధికమిస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
 
మకరం :- వృత్తి వ్యాపారాల యందు ఏకాగ్రత, మెళకువ అవసరం. రుణాల కోసం అన్వేషిస్తారు. దైవ కార్యక్రమాలపట్ల మక్కువ పెరుగుతుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునప్పుడు జాగ్రత్త వహించండి. అనువు కాని చోట ఆధిపత్యం చెలాయించటం మంచిదికాదు.
 
కుంభం :- ఒకరికి సలహా ఇచ్చిమరొకరి ఆగ్రహానికి దురవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచనస్ఫురిస్తుంది. హోటలు, తినుబండ రంగాలలో వారికి చికాకులు తలెత్తుతాయి.
 
మీనం :- గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల రాక ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల గురించి ఒక నిర్ణయానికివస్తారు.