బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-09-2022 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ..

Astrology
మేషం :- వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగస్తులు యూనియన్ వ్యహారాలతో హడావుడిగా ఉంటారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి.
 
వృషభం :- ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. కలిసివచ్చిన అవకాశాన్నితక్షణం సద్వినియోగం చేసుకోండి. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. కోర్టు వాయిదాలు నిరుత్సాహ పరుస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, కీలక వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ఆలయాలు, సేవసంస్థలకు సహాయం అందిస్తారు. ఎదుటివారి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. దీర్ఘకాలిక, ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. ఎరువుల వ్యాపారులు, రేషన్ డీలర్లకు కొత్త చికాకు లెదురువుతాయి. పనులు క్రమే వేగవంతమవుతాయి.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యత ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా భర్తీ కాగలదు. ప్లీడర్లకు పురోభివృద్ధి, వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి సామాన్యం.
 
సింహం :- వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. రుణాలు తీర్చేందుకు చేసేయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం కావటంతో ఒడిదుడుకులు తప్పవు. ఏ విషయంలోను ఒంటెద్దు పోకడ తగదు.
 
కన్య :- ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు ఉండదు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. దైవకార్యాలకు బాగా వ్యయం చేస్తారు. మీ మాటలు ఇతరులకు చేరే వేసే వ్యక్తుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 
తుల :- ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతారు. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఆస్తి వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహనలోపిస్తుంది.
 
వృశ్చికం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. బ్యాంకు పనులు మొక్కుబడిగా సాగుతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకుంటాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి.
 
ధనస్సు :- భాగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెలకువ వహించండి.
 
మకరం :- వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ పాత సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి.
 
కుంభం :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉత్తరా ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మిమ్మల్ని ఉద్రేకపరిచి కొంతమంది లాభపడటానికి యత్నిస్తారు మెళుకువ వహించండి.