సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-03-2024 శుక్రవారం దినఫలాలు - ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరం

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ బ॥ త్రయోదశి రా.8.12 శ్రవణం ఉ.8.35 ప.వ.12.20 ల 1.50.
ఉ.దు. 8.42 ల 9.29 ప.దు. 8.42 ల 9.29 ప. దు. 12.35 ల 1.22.
 
మేషం :- రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. పరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బ తీస్తాయని గుర్తు పెట్టుకోండి. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురువుతాయి. దూరపు మిత్రులను కలుసుకుంటారు. మీ సంతానం విద్యా విషయాలు ఊరట కలిగిస్తాయి.
 
వృషభం :- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలలో సంతృప్తి అభివృద్ధి. స్త్రీలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లుకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మిథునం :- ఎప్పటినుంచో వసూలుకాని మొండిబాకీలు వసూలువుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పయనిస్తాయి. రవాణా రంగాలవారికి మెళేకువ అవసరం. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. మార్కెటింగ్ రంగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి.
 
కర్కాటకం :- ఆత్మీయుల నడుమ కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు లాధాయకం. ఉద్యోగస్తుల బదిలీ, పదోన్నతుల్లో జాప్యం తప్పదు. కోర్టుకు హాజరవుతారు. అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు.
 
సింహం :- ముఖ్యమైన వ్యవహారాలు మీచేతుల మీదుగానే సాగుతాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్తపథకాలు రూపొందిస్తారు. బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. జీవిత భాగస్వామి ఆర్యోగము ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆస్తి పంపకాలు, కోర్టు వ్యవహరాలు పరిష్కారమవుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పనిచేయవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- కాంట్రాక్లరకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. తోటల రంగాల వారికి దళారీల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి.
 
ధనస్సు :- నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు.
 
మకరం :- ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. రుణ యత్నాలు ఏ మాత్రం ముందుకు సాగవు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలరు. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
మీనం :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు బంధు మిత్రుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. మీ సంతానం ఉన్నత విద్యల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు.