గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 20-02-2023 సోమవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం..

Aries
మేషం :- గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది. లౌక్యంగా వ్యవహరించటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ అవసరం. మీ సంతానం విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
వృషభం :- మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు. 
 
మిథునం :- రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. పాత బాకీలు వసూలవుతాయి. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం.
 
కర్కాటకం :- మిత్రులను కలుసుకుంటారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. అనుభవజ్ఞుల సలహా పాటించటం ఉత్తమం.
 
సింహం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. అనుకోని కారణాల వల్ల ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. సోదరీ సోదరుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. తొందరపాటు చర్యల వల్ల వ్యవహారం బెడిసికొట్టవచ్చు.
 
కన్య :- వ్యాపారాలలో ఒడిదుడుకులు సమర్థంగా ఎదుర్కొంటారు. విద్యార్థులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయుట మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, బాధ్యతల్లో చికాకులు అధికం. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
తుల :- బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. తలపెట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా పడతాయి. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. సామూహిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
వృశ్చికం :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రముఖులతో కీలకమైన వ్యవహరాలు చర్చలు జరుపుతారు. ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేయుట చాలా మంచిది. రుణయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికమిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. కొంత మంది సూటీపోటీ మాటలవల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
మకరం :- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలవ్యాపారులకు లాభదాయకం. వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను సమకూర్చుకుంటారు. కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. అన్నిచోట్ల మీ ఆధిక్యతను ప్రదర్శించటం మంచిది కాదు.
 
కుంభం :- ఆత్మీయుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రముఖులతో, పెద్దలతో అభిప్రాయబేధాలు తలెత్తవచ్చు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు వ్యవహరాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఓర్పు, పట్టుదలతో శ్రమించటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగల్గుతారు.